గురుకుల జూనియర్ కళాశాలలో కాంపౌండ్ వాల్ భూమి పూజ

పయనించే సూర్యుడు న్యూస్ జూలై 07/07/2026 కొమరం భీం ఆసిఫాబాద్ డిస్టిక్ జై నూర్ మండల్ రిపోర్టర్ వడ్డీ జనార్ధన్ వార్తా విశ్లేషణ జైనూర్ మండలం బుసిమెట్టలో ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ ” ఆసిఫాబాద్ శాసన సభ్యురాలు కోవ లక్ష్మి , మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మెత విశ్వనాథ్ రావ్ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం బుసిమెట్టలోని గిరిజన గురుకుల జూనియర్ కళాశాలలో కంపౌండ్ వాల్ నిర్మాణానికి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… “గిరిజన బిడ్డల చదువు, భద్రతకు పెద్దపీట ప్రభుత్వం వేయడం జరిగింది అని అన్నరు, పనులు పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారూ. కంపౌండ్ వాల్ వల్ల బయటి వారి ప్రవేశం అడ్డుకుని విద్యార్థులకు పూర్తి భద్రత లభిస్తుందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఆత్రం సింధు నాగేష్ మరియు జైనూర్ మండల ప్రజాప్రతినిధులు , అధికారులు, నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *