పయనించే సూర్యుడు న్యూస్ జూలై 07 యడ్లపాడు మండల ప్రతినిధి… కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా యడ్లపాడు మండలం ఉన్నవ గ్రామంలోని 82వ బూత్ పరిధిలో ఎస్‌ఐఆర్ సర్వే కార్యక్రమం కొనసాగుతోంది. ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ, కొత్త ఓటర్ల నమోదు, పేరు, చిరునామా మార్పులు, ఇతర సవరణలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరిస్తూ ప్రక్రియను వేగవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో బూత్ లెవెల్ ఏజెంట్ గల్లా వీరరాఘవయ్య చురుకుగా పాల్గొని గ్రామ ప్రజలకు ఎస్‌ఐఆర్ ప్రక్రియపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి అర్హత కలిగిన ఓటరు తమ ఓటరు వివరాలను తప్పనిసరిగా ధృవీకరించుకుని, అవసరమైన సవరణలు ఉంటే వెంటనే పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే ఓటరు జాబితాలో ప్రతి అర్హుడి పేరు సక్రమంగా నమోదయ్యేలా, ఎలాంటి పొరపాట్లు లేదా అవకతవకలకు తావులేకుండా ప్రతి దరఖాస్తును నిశితంగా పరిశీలిస్తూ పారదర్శకంగా ఎస్‌ఐఆర్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. గ్రామ ప్రజల సహకారంతో ఈ సర్వే కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది.