పయనించే సూర్యుడు న్యూస్ : పెద్దపల్లి, సెంటినరీ కాలనీ-07: ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ కార్యక్రమంలో భాగంగా రామగిరి మండలం నవాబుపేట గ్రామంలో నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే, ఓటరు వివరాల పరిశీలన, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను క్లస్టర్ ఇన్చార్జి ఆరెళ్లి కొమురయ్య గౌడ్ పరిశీలించారు.ఈ సందర్భంగా బీఎల్ఏ కట్ట శ్రీరామ్‌తో కలిసి కార్యక్రమం పురోగతిపై వివరాలు తెలుసుకుని, ఓటర్ల నమోదు, సవరణలు నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో నవాబుపేట గ్రామ సర్పంచ్ రొడ్డ మౌనిక సతీష్‌కుమార్, ఉపసర్పంచ్ అయిందల లావణ్య రాజ్‌కుమార్, బీఎల్ఓ కట్ట సదానందం, జీపీఓ ఉప్పు దేవయ్య తదితరులు పాల్గొన్నారు.