పయనించే సూర్యుడు జూలై 07 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఎస్ఎం కుమార్ స్వాతంత్ర్య సమరయోధుడిగా, సంఘసంస్కర్తగా, తన పరిపాలన దక్షతతో అఖండ భారతావనికి విశేష సేవలందించిన భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ శ్రీ బాబూ జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఉమ్మడి ఆల్విన్ కాలనీ డివిజన్ మాజీ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ డివిజన్ పరిధిలోని పీజేఆర్ నగర్ చౌరస్తా లోని డాక్టర్ బాబు జగ్జీ వన్ రామ్ మరియు Dr. BR అంబెడ్కర్ గార్ల విగ్రహాలకు పుష్పమాలతో సన్మానించి మహనీయులకు ఘన నివా ళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ భారతదేశ ప్రజాలకు ఆదర్శవంతులు, నిబద్ధత సచ్చీలత దళిత జనోద్ధరణ కృషీవలడు, స్వేచ్చ సమానత్వం, సామాజిక న్యాయం సౌభ్రాతుత్వం పై దేశ ప్రజలను చైతన్యం చేసి, నిమ్న వర్గాల నుండి ఉన్నత స్థానాలను అధిరోహించిన డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ ఆశయాలు అందరికి ఆదర్శం అని అన్నారు. ఆత్మ విశ్వాసమే ఆయుధంగా దళితుల అభ్యున్నతి కోసం మరియు అణగారిన వర్గాల కోసం నిత్యం పాటుపడిన మహానుభావుడు, అఖండ భారత ప్రజల స్వేచ్ఛ కోసం పోరాడిన స్వతంత్ర సమర యోధులు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి దేశ రాజకీయ పరిపాలన దక్షత అనుభవాలు, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ అందరూ ఆద ర్శంగా తీసుకోవాలని అన్నారు.కార్యక్రమంలో స మ్మారెడ్డి జి.రవి, ముజీబ్, మల్లేష్, అగ్రవాసు, రవీందర్, నాగరాజు,గోపి,తిరుపతి, నాగయ్య, వజీద్,బాలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.