​శ్యాంప్రసాద్ ముఖర్జీ వారి 125వ జయంతి వేడుకలు

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ జులై 07.07.2026 మదనపల్లి అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ0 ప్రతి ని ది జె. నాగరాజ// ​భారతీయ జనసంఘ్ స్థాపకులు, మహోన్నత దేశభక్తులు శ్యాంప్రసాద్ ముఖర్జీ వారి 125వ జయంతి సందర్భంగా ఈరోజు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. రాష్ట్ర బీజేపీ మైనారిటీ మోర్చా నాయకులు అయూబ్ ఖాన్,సీనియర్ నాయకులు నానా బాల కుమార్,ఎస్ సి మోర్చా నాయకులు నరసింహులు మాట్లాడు తూ ​125 సంవత్సరాలు.. ఒక మహానేత జన్మించి… ఒక దేశ దిశను మార్చిన ఆలోచనలు!” ​ఈ పవిత్రమైన సందర్భాన్ని పురస్కరించుకొని, పేద ప్రజల ఆకలి తీర్చాలనే సత్సంకల్పంతో సుమారు 200 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అని అన్నారు.పట్టణ ప్రధాన కార్యదర్శి అరికెలా నాగరాజా, కూటమి నాయకులు టీడీపీ గంపల గంగరాజు, నారాయణ రాజు,మోహన్ రెడ్డి,నాగరాజా యాదవ్,నారాయణ రాజు, ​ కార్యకర్తలు మరియు ప్రముఖులు ఈ సేవా కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు. ​దేశం కోసం ఆయన చేసిన సేవలను, త్యాగాలను స్మరించుకుంటూ ఈ సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని నాగరాజు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *