డమ్మీ బోర్లు’పై విజిలెన్స్ సైలెంట్.. తెరవెనుక లావాదేవీలా?

విద్యుత్ శాఖ జిల్లా అధికారుల పర్యవేక్షణ లోపం - చట్టపరమైన చర్యలు శూన్యం

పయనించే సూర్యుడు జులై 8 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్

.

తల్లాడ:

విద్యుత్ శాఖలోని అవినీతిపై సంచలన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉండాల్సిన పనులు చేయకుండా కాగితాలపైనే బిల్లులు పెట్టే డమ్మీ బోర్లు వ్యవహారం జిల్లా అధికారులకు తెలిసి కూడా ఎలాంటి చర్యలు లేకపోవడం అనుమానాలకు తావిస్తుంది. ఏం జరుగుతుంది? విద్యుత్ సరఫరా మెరుగుపరిచే పేరుతో కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు, బోర్లు మంజూరు చేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే చాలా చోట్ల అవి కేవలం కాగితాలకే పరిమితమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. స్థానికులు వీటినే డమ్మీ బోర్లు అని పిలుస్తున్నారు. అంటే బిల్లు అయింది, కానీ బోరు లేదు అన్నమాట. అధికారులు ఏం చేస్తున్నారు విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఈ అక్రమాలు జిల్లా స్థాయి విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి పలుమార్లు వచ్చాయి. అయినప్పటికీ

.

‘తూతూ మంత్రంగా’ పర్యవేక్షణ

బాధ్యులపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేదు. ఇదే విషయమై విజిలెన్స్ శాఖ అధికారులు సైతం ఇక్కడకు వచ్చి విచారించినా ఫలితం శూన్యం తనిఖీలు చేసి వెళ్లిపోయారు తప్ప ఇప్పటివరకు ఒక్క అరెస్టు గానీ, సస్పెన్షన్ గానీ జరగలేదు. తెరవెనుక ఏముంది అధికారులు చర్యలు తీసుకోకపోవడానికి గల కారణంపై సర్వత్రా చర్చ జరుగుతుంది.

.

‘తెరవెనుక భారీ లావాదేవీలు’

జరిగినట్టుగా స్థానిక వర్గాల సమాచారం. దీనివల్లే దోషులు హాయిగా తిరుగుతున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ప్రభుత్వ ఖజానాకు లక్షల రూపాయల నష్టం వాటిల్లుతున్నా, నిఘా వర్గాలు కళ్లు మూసుకుని ఉండటంపై సామాజిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వెంటనే ఉన్నతాధికారులతో స్వతంత్ర విచారణ జరిపించాలి. డమ్మీ బోర్లకు బాధ్యులైన కాంట్రాక్టర్లు, అధికారులపై IPC 420 మోసం, PC Act అవినీతి కింద కేసులు నమోదు చేయాలి. కాజేసిన ప్రజాధనాన్ని రికవరీ చేయాలి. అక్రమార్కులను వెంటనే శిక్షించకపోతే ప్రజా సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని స్థానికులు హెచ్చరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *