యడ్లపాడు మండలం తిమ్మాపురంలో ఘనంగా మహానేత వైఎస్‌ఆర్ జయంతి వేడుకలు

పయనించే సూర్యుడు న్యూస్ జూలై 09 యడ్లపాడు మండల ప్రతినిధి.. యడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామంలో మహానేత డా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు వైఎస్‌ఆర్ ప్రజలకు అందించిన సంక్షేమ పాలన, రైతులు, పేదలు, విద్యార్థులు, మహిళల అభ్యున్నతి కోసం చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో యడ్లపాడు మండల యూత్ అధ్యక్షుడు కొప్పుల శ్యామ్ పాల్, తిమ్మాపురం గ్రామ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుర్ర శ్రీనివాసరావుతో పాటు క్రిష్ణ, భాగ్యరాజు, దేవయ్య, దేవప్రసాద్, నాగరాజు, రమేష్ తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని మహానేతకు ఘన నివాళులు అర్పించారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *