పయనించే సూర్యుడు న్యూస్, జూలై 09 (ఏలేశ్వరం మండల రిపోర్టర్ ఏ శివాజీ) : ఏలేరు జలాశయ మార్గమునకు ఇరువైపులా, మరియు, కెనాల్ సమీపంలో(సీడ్ బాల్స్ )విత్తనాలను జల్లే కార్యక్రమం అటవీశాఖ అధికారులు నిర్వహించారు. ఏలేశ్వరం రేంజ్ అధికారి దుర్గా రాంప్రసాద్ అద్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా అటవీశాఖ అధికారి ఎం. రామచంద్రరావు స్థానిక తాసిల్దార్ కే కీర్తి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులు చేతుల మీదుగా డీఎఫ్ ఓ, రామచంద్ర రావు విత్తనాలను జల్లే కార్యక్రమం చేపట్టారు. రేలా, తానే,నేరేడు,దేవ కాంచనం, కొండ బూరుగ, తెడ్లపాల,రకాల ఐదువేల విత్తనాలను ప్రముఖులు విద్యార్థులు చేతుల మీదుగా రహదారికురువైపులా ఏలేరు జలాశయం కెనాల్ పరిధిలో జల్లే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డి ఎఫ్ ఓ రామచంద్ర రావు మాట్లాడుతూ విత్తనబంతులు జల్లుట వల్ల ఉపయోగాలను విద్యార్థులకు వివరించారు పచ్చదనం పరిశుభ్రత పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని విద్యార్థులకు సూచించారు.తాసిల్దార్ కే కీర్తి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి పర్యావరణం పరిరక్షణ దిశగా అడుగులు వేయాలని సూచించారు.మొక్కలు పెంపకం వాటి ప్రాముఖ్యత తెలుసుకోవాలని కోరారు. రేంజర్ దుర్గ రాంప్రసాద్ మాట్లాడుతూ అడవులు సం రక్షణ, అభివృద్ధి, పై విద్యార్థులకు వివరించారు.ఈ కార్యక్రమంలో డి వై ఆర్ వో, జి నాగేశ్వరరావు,అటవీ శాఖ అధికారులు మీనాక్షి,ఈశ్వర రెడ్డి,అప్పలకొండ సురేష్,గురుకుల పాఠశాల అధ్యాపకులు, విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.