తాడిచర్ల-2 కోల్ బ్లాక్ కేటాయింపుపై హర్షాతిరేకాలు

* ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం

పయనించే సూర్యుడు న్యూస్: పెద్దపల్లి,రామగిరి-9: సింగరేణి సంస్థకు తాడిచర్ల-2 కోల్ బ్లాక్‌ను కేంద్ర ప్రభుత్వం కేటాయించిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ రామగిరి మండల అధ్యక్షుడు కొండు లక్ష్మణ్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి చిత్రపటాలకు నాయకులు, కార్యకర్తలు పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తాడిచర్ల-2 కోల్ బ్లాక్ కేటాయింపు సింగరేణి సంస్థ అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో సంస్థ ఆర్థికంగా మరింత బలోపేతం కావడంతో పాటు పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని తెలిపారు.కేంద్ర ప్రభుత్వం ఎలాంటి వేలం ప్రక్రియ నిర్వహించకుండా ఈ కోల్ బ్లాక్‌ను నేరుగా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కు కేటాయించారని ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి తోట్ల రాజు, మహిళా అధ్యక్షురాలు రోడ్డ వరలక్ష్మి, కార్యదర్శి కొత్త కమలాకర్, ఓబీసీ అధ్యక్షుడు మైదం సందీప్, బిఎంఎస్ నాయకులు ఎం.డి. జానీ, క్రాంతి, కార్యకర్తలు చిప్పకూర్తి చక్రి, రమేష్, కృష్ణాకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *