ఆదోని మున్సిపల్ కార్యాలయం లో ఏర్పాటుచేసిన ఎన్నికల

వార్డుల లిస్టులను పరిశీలిస్తున్న సిపిఎం నాయకులు.

పయనించే సూర్యుడు మే 20 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో ప్రకటించిన విధంగా ఆదోని పట్టణ మున్సిపాలిటీ నందు 42 వార్డుల నుండి 52 వార్డుల వరకు పెంపుదలకు సంబంధించిన వార్డుల సరిహద్దుల ఓటర్ లిస్టు నమూనాను మున్సిపల్ కార్యాలయం నందు గల సమాచార పట్టిక నందు ఉంచిన లిస్టులను సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మన్న, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు గోపాల్, తిప్పన్న, పట్టణ కమిటీ నాయకులు వెంకటేశులు, నాగరాజు తదితరులు పరిశీలించడం జరిగింది. అనంతరం వీరు మాట్లాడుతూ ఆదోని మున్సిపల్ అధికారులు నోటీసు బోర్డులో ఉంచిన విధంగా వార్డుల విభజన ప్రక్రియ చూస్తుంటే మేడిపండు చూడు మేలిమై ఉండు పొట్ట ఉప్పి చూడు పురుగులుండు అనే చందంగా ఉన్నాయి అన్నట్టుగా అనిపిస్తున్నాయని వార్తలు తెలిపారు. సరిహద్దులో ప్రక్రియ బాగున్నప్పటికీ అయితే వార్డులలో ఏ వార్డులో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, అనే సంఖ్య చూపించలేదని వారు తెలిపారు. గతంలో ఇదేవిధంగా ఇంటి నెంబర్లు ఆధారంగా విభజన చేస్తే ఒక వార్డు ఓటరు వేరే వార్డులలో ఓటు వేసే వారు,అలాగే ఒకే కుటుంబంలో భార్య ఒక పోలింగ్ బూతు నందు భర్త వేరే పోలింగ్ బూతు నందు ఓటర్లుగా ఉన్నారని వారు గుర్తు చేశారు. ఒక పోలింగ్ బూత్ లో ఆ బూతు పరిధిలో వారితోపాటు సుదూర ప్రాంతాల వారిని కూడా ఒక పోలింగ్ బూత్ గా ఉన్న వార్డులు అనేకం ఉన్నాయని వారు తెలిపారు. ప్రస్తుతం సంబంధిత అధికారులు కేవలం మ్యాపింగ్ పద్ధతిలో విభజన చేసినట్లుగా ఉన్నారు అలా కాకుండా వార్డు పరిధిలో సమగ్రమైన విచారణ జరిపి ఒక వార్డు పరిధిలో దాని చుట్టూ ఉన్న ఓటర్లను ఒకే వార్డులో ఉండే విధంగా ఫీల్డ్ ఎంక్వైరీ చేయాలని వారు తెలిపారు. లేనిపక్షంలో భవిష్యత్తులో జరిగే మున్సిపల్ ఎన్నికలలో కూడా గత మాదిరి గానే జిగ్జాగ్ పద్ధతిలో ఓటర్ లిస్టులో ఉండే అవకాశం ఉందని వారు తెలిపారు అదేవిధంగా సవరణలు అభ్యంతరాల కొరకు మున్సిపల్ అధికారులు కేవలం ఈనెల 24వ తేదీ వరకు మాత్రమే గడువు పెట్టడం సరైనది కాదని దీనిని మరింత పొడిగించాలని వారు కోరారు. అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీల సమావేశాన్ని కూడా వెంటనే ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలను కూడా తెలుసుకోవాలని వారు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *