నేటి యువత పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి అప్పుడే ఆయనకు నియమైనా నివాళి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గన్నేరo నర్సయ్య

కమ్యూనిస్టు యోధుడు, పేద కార్మిక కర్షక మహానేత పుచ్చలపల్లి సుందరయ్య, 41 వ వర్ధంతి సందర్భంగా

పయనించే సూర్యుడు న్యూస్:మే/20:నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి:సాయిరెడ్డి బొల్లం: రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం పెద్ద లింగపూర్ గ్రామంలో ఉపాధి కూలీల ఆధ్వర్యంలో ఆయనకు ఘన నివాళులు. అర్పించడం జరిగింది. సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గన్నేరo నర్సయ్య, మాట్లాడుతూ దక్షిణ భారత కమ్యూనిస్టు నిర్మాత బడుగు బలహీన వర్గాల పక్షపాతి అభ్యుదయ వాది అయినా పుచ్చలపల్లి సుందరయ్య, పోరాటం ఈ దేశానికి బడుగు బలహీన వర్గాలకు ఎంతో ఉపయోగపడిందని పేద వర్గాలకు సేవ చేయడం కోసం రెడ్డి అనే పదము అడ్డు వస్తుందని తన పేరును పుచ్చలపల్లి సుందరం రెడ్డికి బదులుగా పుచ్చలపల్లి సుందరయ్యగా పేరు మార్చుకొని పేద వర్గాల కోసం జీవించాడని అన్నారు. పిల్లలు పుడితే తాము ఉద్యమానికి న్యాయం చేయలేమని తమకు సంతానమే వద్దు అనుకున్న మహానేత అని కొనియాడారు. నేడు ఈ దేశానికి సుందరయ్య లాంటి నాయకులు కావాలని ఆయన ఆదర్శాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఆయన కలలు కన్నా రాజ్యం కోసం నిరంతరం కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలొ ఉపాధి హామీ కార్మికులు రాజిరెడ్డి, తిరుపతి, భారతి, మల్లారెడ్డి, మల్లయ్య, లక్ష్మీ, రాజు, శ్రీనివాస్,లక్ష్మి, జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *