పయనించే సూర్యడు మే.20.2026 బాధ్యులపై హత్య కేసులు నమోదు చేయాలి.పి.సి.సి డెలిగేట్ మెంబర్ పాచిపెంట చిన్నస్వామి డిమాండ్.అల్లూరి సీతారామరాజు జిల్లా,అరకు వేలి మండల అరకు వేలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా మిత్రులకు నమస్కారములతో.కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక ప్రకటన విడుదల చేశారు పాడేరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి(జిజిహెచ్)లో వైద్యుల నిర్లక్ష్యం,అత్యవసర వైద్య సదుపాయాల కొరత,అంబులెన్స్ సేవల వైఫల్యం కారణంగా.వరుసగా గిరిజనుల ప్రాణాలు కోల్పోతుండటం అత్యంత దారుణమని పి.సి.సి డెలిగేట్ మెంబర్ పాచిపెంట చిన్నస్వామి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.అనంతగిరి మండల పైనంపాడు పంచాయతీ కాకరపాడు గ్రామానికి చెందిన నందుల కరుణమ్మ (38) తీవ్ర అస్వస్థతతో బాధపడుతుండగా.సరైన వైద్యం,అంబులెన్స్ సకాలంలో అందించకపోవడంతో.ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.ఒక ఆసుపత్రి నుండి మరో ఆసుపత్రికి తిప్పుతూ.చివరకు అంబులెన్స్ ఇవ్వకపోవడం ప్రభుత్వ వైద్య వ్యవస్థ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.అలాగే హుకుంపేట మండలం గడికించుమండ గ్రామానికి చెందిన బంగురు రమేష్ సుమలత దంపతుల పసికందు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది.పడుతుండగా పాడేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అక్కడ పిల్లలకు అవసరమైన వైద్య పరికరాలు లేకపోవడంతో విశాఖపట్నం కేజీహెచ్‌కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించినప్పటికీ,అంబులెన్స్ గంటల తరబడి రాకపోవడంతో.ఆ పసి ప్రాణం కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.పాచిపెంట చిన్నస్వామి మాట్లాడుతూ…“ఏజెన్సీ ప్రాంత ప్రజలు గిరిజనులు కాబట్టి.వారి ప్రాణాలకు విలువ లేదా? పేరుకే జిల్లా ఆసుపత్రి కానీ,అక్కడ కనీస అత్యవసర వైద్య సదుపాయాలు కూడా లేవు.అంబులెన్స్ కోసం కుటుంబ సభ్యులు వేడుకున్నా స్పందించకపోవడం అమానుషం.ఇది సాధారణ నిర్లక్ష్యం కాదు–ప్రభుత్వ వైద్య వ్యవస్థ చేసిన ప్రాణహత్య”అని మండిపడ్డారు.“ఒక గిరిజన మహిళ,ఒక పసిబిడ్డ ప్రాణాలు కోల్పోవడానికి.కూటమి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే కారణం.గిరిజన ప్రాంతాల్లో వైద్య వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది.అధికారులు కేవలం ప్రకటనలకే పరిమితమై ప్రజల ప్రాణాలను పట్టించుకోవడం లేదు”అని విమర్శించారు.“నందుల కరుణమ్మ మరణం,పసిబిడ్డ మృతిపై వెంటనే న్యాయ విచారణ.జరిపి జిజిహెచ్ సూపరింటెండెంట్,సంబంధిత వైద్యులు,అంబులెన్స్ బాధ్యులపై సస్పెన్షన్‌తో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.అవసరమైతే హత్య కేసులు నమోదు చేయాలి”అని డిమాండ్ చేశారు.అలాగే కరుణమ్మ కుటుంబానికి ₹25 లక్షల ఎక్స్‌గ్రేషియా,కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని,పసిబిడ్డ కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం ప్రకటించాలని కోరారు.ఏజెన్సీ ప్రాంత ఆసుపత్రుల్లో 24 గంటల అంబులెన్స్ సేవలు ప్రత్యేక వైద్య బృందాలు పిల్లల అత్యవసర చికిత్స విభాగాలు ఆక్సిజన్, వెంటిలేటర్, ఐసీయూ సదుపాయాలు.నిపుణులైన వైద్యుల నియామకం.తక్షణమే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గిరిజనుల ప్రాణాలను నిర్లక్ష్యం చేసే అధికారుల వైఖరి మారేంతవరకు ప్రజా ఉద్యమాలు,ధర్నాలు,ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. గిరిజనుల ప్రాణాలను కాపాడండి!వైద్యుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోండి!అంబులెన్స్ వ్యవస్థను బలోపేతం చేయండి!కరుణమ్మ కుటుంబానికి,పసిబిడ్డ కుటుంబానికి న్యాయం చేయాలి!పాడేరు జిల్లా ఆసుపత్రికి పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పించాలి!ఈ కార్యక్రమంలో ఆదివాసి కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ తెలగంజి సోమేశ్వరరావు కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పాంగి గంగాధర్ డుంబురిగూడ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తేడాబారికి భీమ రావు తదితరులు పాల్గొన్నారు.