పయనించే సూర్యుడు మే 20 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) చదరంగం అనేది ఒక అద్భుతమైన ఎత్తుకు పైఎత్తులు వేసే ఆట. చదరంగం ఆట ద్వారా మానసిక శక్తి పెరుగుతుందని చాలామంది అభిప్రాయం. అలాంటి మానసిక శక్తి వినిపించే చదరంగం ఆటకు సంబంధించి షాద్ నగర్ లో టౌన్ లెవెల్ మూడవ చదరంగం పోటీలు నిర్వహించనున్నారు. ఈ చదరంగం పోటీలలో 7, 9, 11, 13, 15, 17 సంవత్సరాల వయసుగల బాలబాలికలు అందరికీ అవకాశం కల్పిస్తున్నారు. స్థానిక మున్సిపాలిటీ పరిధిలోని 24వ వార్డులో గల శ్రీ సరస్వతి శిశు మందిర్ స్కూల్ ప్రక్కన గల పతాంజలి యోగా సెంటర్ వేదికగా జూన్ 01వ తేదీ బుధవారం రోజున ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు చదరంగం పోటీలు నిర్వహించనున్నట్లు, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని, చదరంగం పోటీలలో పాల్గొని తమ అత్యున్నతమైన ప్రతిభను ప్రదర్శించాలని షాద్ నగర్ చెస్ అకాడమీ కోచ్ వానరాసి జగన్ తెలిపారు. అనంతరం గెలిచిన బాలికలందరికి బహుమతి ప్రధానోత్సవం ఉంటుందని వానరాసి జగన్ తెలిపారు. ఆసక్తికర బాలబాలికలందరూ తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోగలరు ఆసక్తి కలిగిన చదరంగ క్రీడాకారులు ఈ ఫోన్ నెంబర్లకు 9346843126, 9666723582 ఫోన్ చేసి తమ సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాలని షాద్ నగర్ చెస్ అకాడమీ కోచ్ వానరాసి జగన్ తెలిపారు.