పేకాట స్థావరంపై ఏన్కూరు పోలీసుల దాడి

* ఎస్సై సంధ్య తమ సిబ్బందితో పేకాట స్థావరాలపై దాడులు * దాడిలో 10 మంది పట్టివేత

పయనించే సూర్యుడు మే 3 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్

ఏన్కూరు:

మేడేపల్లి గ్రామ శివారులో పేకాట స్థావరంపై ఏన్కూరు పోలీసుల దాడి 10 మంది పట్టివేత ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఏన్కూరు పోలీస్ స్టేషన్ పోలీసులు విశ్వసనీయ సమాచారం మేరకు మేడేపల్లి గ్రామ శివారులో ఆకస్మికంగా దాడి నిర్వహించారు. దాడి సమయంలో నగదు పెట్టి పేకాట ఆడుతున్న 10 మంది వ్యక్తులను పట్టుకున్నారు. నిందితుల వద్ద నుండి రూ.7,500/- నగదు మరియు 52 పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టడం జరిగింది. .

.

స్వాధీనం చేసుకున్న వస్తువులు:


రూ.7,500/- నగదు ప్రజా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే జూదం, పేకాట వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాల నిర్మూలనకు ఖమ్మం పోలీస్ కమిషనరేట్ ప్రత్యేక దృష్టి సారించింది. గ్రామాలు మరియు శివారు ప్రాంతాల్లో నిరంతరం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరుగుతోంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వసుందర యాదవ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, కల్లూరు సబ్ డివిజన్ మాట్లాడుతూ, జూదం మరియు పేకాట వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో ఇలాంటి కార్యకలాపాలు జరుగుతున్నట్లు గమనించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని కోరారు. ఏన్కూరు ఎస్ హెచ్ ఓ మరియు స్టేషన్ సిబ్బంది కలిసి పేకాట స్థావరంపై దాడులు నిర్వహించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *