ముఠా వర్కర్స్ కూలి రేట్లు పెంచాలి .

సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సి.హెచ్.ప్రభాకర్.

పయనించే సూర్యుడు గూడూరు న్యూస్. మే 23 ముఠా వర్కర్స్ కూలి రేట్లు పెంచాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సి.హెచ్.ప్రభాకర్ పేర్కొన్నారు.శుక్రవారం గూడూరు పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో ముఠా వర్కర్స్ తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల నెలా ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం కూలి రెట్లు సరిపోవడం లేదన్నారు,ముఖ్యంగా కూరగాయలు , గ్యాస్ , ఇంటి అద్దె, కరెంట్ బిల్లు, విద్యార్థుల స్కూల్ ఫీజులు , ఆసుపత్రి ఖర్చులు గణనీయంగా పెరగడంతో జీవన వ్యయం భారీ గా పెరిగిందని , కానీ కూలి రెట్లు మాత్రం పెరగలేదన్నారు. గత 12 ఏళ్లుగా ముఠా వర్కర్స్ చాలి చాలని కూలీ రేట్లతో జీవనం గడుపుతున్నారని పేర్కొన్నారు. మార్కెట్ అసోసియేషన్లు వారి శ్రమని దోపిడి చేస్తున్నారు తప్ప , పనికి తగిన కూలీలు ఇవ్వడం లేదన్నారు.ఇకనైనా వారి శ్రమను గుర్తించి కూలి రేట్లను పెంచాలన్నారు. ముఠా వర్కర్స్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.అనంతరం గూడూరు ముఠా వర్కర్స్ నూతన సమితి నీ ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా బొబ్బిలి మునిశేఖర్ ,కార్యదర్శిగా బండి పాపయ్య, ఉపాధ్యక్షులుగా మనుబోలు గోపి, సహాయ కార్యదర్శి మల్లి పెంచలయ్య , కోశాధికారి బండి కృష్ణ ను ఎన్నుకున్నారు. అనంతరం నూతన కమిటీ కి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ గూడూరు పట్టణ కన్వీనర్ సునీల్ , ముఠా వర్కర్స్ నాయకులు వెంకటయ్య , తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *