పోషకాహార సరుకుల పంపిణీ

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్, జూన్ 09 మామిడిపెల్లి లక్ష్మణ్ రాయికల్ మండలంలోని కట్కాపూర్ అంగన్వాడీ కేంద్రాల్లో సోమవారం గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పోషకాహార సరుకులు పంపిణీ చేశారు. వేసవి సెలవులను ఈ నెల15 వరకు పొడిగించిన నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల లోపు చిన్నారులు, మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లల బరువులు, ఎత్తులు కొలిచి తల్లులకు పోషకాహారంపై అవగాహన కల్పించారు. అనంతరం బియ్యం, పప్పు, నూనె, గుడ్లు, పాలు, బాలామృతం, బాలామృతం ప్లస్, మురుకులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ అనూహ్య, అంగన్వాడీ టీచర్లు ఈ.సంధ్యారాణి,నాగరత్న, రాధాతో పాటు గర్భిణీలు, బాలింతలు,తల్లులు, చిన్నారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *