పయనించే సూర్యుడు జూలూరుపాడు రిపోర్టర్ మే 22/26 జూలూరుపాడు మండలంలో రైతులు పండించిన వరి మరియు మొక్కజొన్న పంటలను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైతులకు న్యాయమైన మద్దతు ధర కల్పించాలని కోరుతూ బీజేపీ మండల అధ్యక్షుడు భూక్యా రమేష్ ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ (MRO) వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు భూక్యా రమేష్ మాట్లాడుతూ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కొనుగోలు కేంద్రాల్లో ఆలస్యం కారణంగా రైతులు ఆర్ధికంగా మానసికంగా తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు వెంటనే కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు అలాగే రైతులకు సరైన గోనె సంచులు తూకం సదుపాయాలు కల్పించి చెల్లింపులు త్వరగా జరగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ నాయకులు అన్నవరపు సత్యనారాయణ మండల ప్రధాన కార్యదర్శి నిమ్మటూరి రామారావు మండల ఉపాధ్యక్షుడు కృష్ణంశెట్టి గోపాలరావు గిరిజన మోర్చా అధ్యక్షుడు భూక్యా రవి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు