పయనించే సూర్యుడు న్యూస్ మే 20 సాలూర : సాలూర మండల కేంద్రంలోని హనుమాన్ మందిరం వద్ద మంగళవారం అఖండ హరినామ సప్తహ రెండో రోజు కొనసాగుతుంది మందిరం వద్ద నెలకొల్పిన పీటం వద్ద ప్రత్యేక పూజలు వివిధ రకాల పూజలు మరియు పలు పీఠాధిపతులు మహారాజుల వారిచేప్రవచనాలుభజనలు కీర్తనలు ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు సప్తహ మండపం వద్ద అన్నదాన కార్యక్రమాలు భజనలు కీర్తనలు రెండో రోజు అన్నదాన కార్యక్రమాన్నినిర్వహించారు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి పూజలు చేశారు.తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు,గ్రామస్తులు,భక్తులు తదితరులు పాల్గొన్నారు.