పయనించే సూర్యుడు, జూన్ 4 2026, నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలంలోని అంకమొనికుంట గ్రామానికి చెందిన మొకరాల వెంకయ్య ఇంటి నిర్మాణం కోసం తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి రూ.25,000/ ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా గోలి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందులతో ఇల్లు నిర్మించుకోలేకపోతున్న నిరుపేద కుటుంబాలకు తన వంతు సహాయ సహకారాలు అందించడం సామాజిక బాధ్యతగా భావిస్తన్నాని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మొకరాల వెంకయ్య కుటుంబ సభ్యులు తమ ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అందించిన గోలి శ్రీనివాస్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ అనిల్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు.