పయనించే సూర్యుడు జూన్ 03, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చింతకాని మండల వ్యాప్తంగా సోమవారం ఘనంగా నిర్వహించారు. మండలంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామపంచాయతీలలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా “జై తెలంగాణ” నినాదాలతో వేడుకలు నిర్వహించారు.వక్తలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమాన్ని, అమరుల త్యాగాలను గుర్తు చేసుకుని వారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. నిధులు, నీళ్లు, నియామకాల సాధనే లక్ష్యంగా సాగిన ఉద్యమ ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలపాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో వేడుకలు చింతకాని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ బాబ్జీ ప్రసాద్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. చింతకాని పోలీస్ స్టేషన్లో ఎస్ఐ వీరేందర్ తన సిబ్బందితో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ అల్తాఫ్, సూపర్వైజర్ కృష్ణారావు పాల్గొన్నారు.నాగులవంచ గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ నారగాని రాంబాయి, నేరడ గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ దుసరి నేతాజీ, పందిళ్లపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ వత్సవాయి పద్మ, తిమ్మినేనిపాలెం గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ కొమ్ము ప్రభు ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పంచాయతీ కార్యదర్శి శశికళ, గ్రామ పెద్దలు షేక్ మదార్, ఆళ్ల శ్రీనివాసరావు, ఆశా కార్యకర్త బద్రి కాశి, పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.