ఆంజనేయస్వామిని దర్శించుకున్న అష్టలక్ష్మి పీఠం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పీతాంబరం రఘునాథ చార్య స్వామి

పయనించే సూర్యుడు, జూన్ 03 ,బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. బూర్గంపాడు మండలం, సారపాక మంగళవారం సాకేతపురి ఆంజనేయ స్వామిని ,శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామిని, అనకాపల్లి అష్టలక్ష్మి పీఠం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ పీతాంబరం రఘునాథ చార్య స్వామి ఉదయం తొమ్మిది గంటలకు ఆలయానికి వచ్చి స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించినారు ఈ సందర్భంగా వారు భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ సనాతన వైదిక ధర్మాన్ని, హిందూ సంస్కృతిని అందరూ తెలుసుకొని ఆచరణలో పెట్టాలని, మనమంతా గడప లోపలే కులమని గడప దాటితే మనమంతా హిందువులని, ఐక్యమత్యం గా ఉంటే భవిష్యత్తులో ఎన్ని అవరోధాలు వచ్చినా మనమంతా ఏకమై ఎదుర్కోవచ్చునని, ఆంజనేయ స్వామిని నిత్యము పూజిస్తుంటే శత్రుపీడలు ఉండమని, శ్రీ రామ నామము చెబితే దుఃఖాలు దూరమవుతాయని ఉద్బోధించారు.ఆలయ నిర్మాణం, ఆలయ అభివృద్ధి బాగా జరగాలని, బాల అరిష్టాలు ఉంటే పోవాలని వారు కోరుతున్నారు. అదేవిధంగా స్వామి వారిని,పుష్కర కాలం కిందట ఈ స్థలంలో నిర్వహిస్తున్న శ్రీ రామ జయ రామ జయజయ రామ విజయ మంత్రాన్ని 24 గంటలు ఏకాహం జరుగుతున్న శుభ సందర్భంలో వచ్చి పాల్గొని స్వామిని దర్శించానని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో సాకేతపురి ఆంజనేయస్వామి సేవా సమితి సభ్యులు ఎం.వి సుబ్రహ్మణ్యం, పొట్రు ఏసుబాబు, దారం వెంకటరెడ్డి మరియు హనుమాన్ చాలీసా భక్త బృందం జి. వెంకటేశ్వర్రావు , భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *