బిజెపి పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

పయనించే సూర్యుడు) ఘట్కేసర్ సర్కిల్, నాగారం డివిజన్ లో తెలంగాణ12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బిజెపి పార్టీ ఆధ్వర్యంలో నాగారం మాజీ చైర్మన్ కౌకుంట్ల చంద్ర రెడ్డి చేతుల మీదుగా జెండా ఎగరవేయడం జరిగింది. ఈ సందర్భంగా నాగారం మాజీ చైర్మన్ చంద్ర రెడ్డి మాట్లాడుతూ… రానున్న రెండు సంవత్సరాలలో బిజెపి పార్టీ అధికారంలోకి కచ్చితంగా వస్తుందని అన్నారు. అలాగే ప్రజలు కూడా బిజెపి నాయకత్వంలో చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు దృష్టిలో పెట్టుకొని రానున్న రెండు సంవత్సరాల్లో బిజెపి భారీ ఎత్తున అధిక ఓట్లతో విజయం సాధిస్తుందని, ఈసారి బిజెపి పార్టీ పట్టం కడుతుందని, ప్రజలు ఆశిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్, బిజెపి సీనియర్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని జాతీయ జెండా ఎగరవేయడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *