రాయికల్ ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ జూన్ 02 మామిడిపెల్లి లక్ష్మణ్ ​రాయికల్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాయికల్ బస్ స్టాండ్ వద్ద వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అలిగేటి అనిల్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ​ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరుల త్యాగాలను స్మరించుకున్నారు.ప్రజా ప్రతినిధులు ఈ వేడుకల్లో పాల్గొని రాష్ట్ర ప్రగతికి పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ​ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కట్కం రవీందర్, వైస్ చైర్మన్ తురగ సౌజన్య-శ్రీధర్, కౌన్సిలర్లు బత్తిని మహేశ్వరీ- నాగరాజు,తెరాస మండల అధ్యక్షులు బర్కం మల్లేష్ ,కొయ్యడి మహిపాల్, మ్యాకల రమేష్, మహేష్ గౌడ్, హరీష్ రావు, శ్రీరాముల సత్యనారాయణ, కన్నాక మహేందర్ ఇతర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *