పయనించే సూర్యుడు జూలూరుపాడు రిపోర్టర్ జూన్ 7/26 మండల పరిధి కాకర్ల గ్రామంలో మాస్టర్ ఈకే శతాబ్ది సందర్భంగా మాస్టర్ ఈకే ఆధ్యాత్మిక సేవా సంస్థ కొత్తగూడెం వారి ఆధ్వర్యంలో ఉచిత హోమియో వైద్య సేవ శిబిరాన్ని శనివారం ఏర్పాటు చేశారు ఈ వైద్య శిబిరంలో గ్రామంలోని దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న సుమారు 130 మంది రోగులకు పరీక్షలు నిర్వహించి హోమియో మందులను ఉచితంగా పంపిణీ చేశారు ఈ మందులను రోగులకు వ్యాధి నియంత్రణలోకి వచ్చేవరకు ఉచితంగా పంపిణీ చేయటం జరుగుతుందని తెలిపారు ఈ సందర్భంగా హోమియో డాక్టర్స్ జి రాధాకృష్ణమూర్తి టీ రవికాంత్ లు మాట్లాడుతూ ప్రస్తుత ఆధునిక యుగంలో మారిన ఆహారపు అలవాట్లు అనేక రకాల ఆరోగ్య సమస్యలకు ప్రధాన కారణం అన్నారు దానితోపాటు ఆరోగ్య సమస్యల నివారణకు మనం వాడుతున్న ఇంగ్లీష్ మందుల వలన ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని తెలిపారు కాబట్టి మన ఆహారపు అలవాట్లు మార్చుకోవడంతోపాటు ఇంగ్లీష్ మందుల వాడకాన్ని తగ్గించి హోమియో మందులు వాడడం వలన ఆరోగ్యంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు దరిచేరే అవకాశం ఉండదని తెలిపారు కావున ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారైనా నిర్భయంగా హోమియో మందులను వాడుకోవచ్చునని తెలిపారు ఈ కార్యక్రమంలో ఖాదరేంద్రబాబు కే శ్రీనివాసరెడ్డి పిఎస్ఎస్ మూర్తి పి శ్రీధరరావు టీ ధనలక్ష్మి కోటేశ్వరరావు కరుణ వీరమల్లు సిహెచ్ శ్రీమన్నారాయణ గ్రామస్తులు రాచబంటి వెంకటనరసయ్య కళ్యాణం వెంకటప్పయ్య గోగుల వెంకటేశ్వర్లు సున్నం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు