అమ్మ పేరుతో ఒక మొక్క… రాయికల్‌లో ఘనంగా వనమహోత్సవం కార్యక్రమం…

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ జూన్ 12 మామిడిపెల్లి లక్ష్మణ్ రాయికల్ పట్టణంలోని పెద్ద చెరువు పరిసర ప్రాంతంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో 2026-27 వనమహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. “ఒక మొక్క – అమ్మ పేరుతో అనే ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పునాది వేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మనోహర్, మేనేజర్ వెంకట్, 6వ వార్డ్ కౌన్సిలర్ వేముల మౌనిక (బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్), కో-ఆప్షన్ సభ్యులు ఇర్ఫాన్ అలీ, మున్సిపల్ సిబ్బంది, ఆర్.పీ మెంబర్స్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరుతో ఒక మొక్క నాటి దాన్ని సంరక్షించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. చెట్లు మన జీవితానికి ఎంత ముఖ్యమో తెలియజేస్తూ, పచ్చదనాన్ని పెంపొందించడం మనందరి బాధ్యత అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *