మొక్కజొన్న కొనుగోళ్లలో రాష్ట్రంలో అగ్రగామిగా చింతకాని మండలం

* ప్రభుత్వానికి రైతులు, నాయకుల కృతజ్ఞతలు

పయనించే సూర్యుడు జూన్ 09, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని : మొక్కజొన్న కొనుగోళ్లలో రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచిన చింతకాని మండలానికి సంబంధించి నాగులవంచ సహకార సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వానికి కృతజ్ఞతా సమావేశం నిర్వహించారు. నాగులవంచ సహకార సంఘం అధ్యక్షుడు నల్లమోతు శేషగిరిరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మత్కేపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చిత్రపటాలకు నాయకులు, రైతులు కలిసి పాలాభిషేకం నిర్వహించారు. అంబటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రత్యేక చొరవతో రాష్ట్రంలోనే తొలి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు చింతకాని మండలంలో ఏర్పాటు చేశారని తెలిపారు. అంచనాలకు మించి పంట దిగుబడి రావడం, గోదాముల కొరత, హమాలీల సమస్య, లారీల కొరత వంటి ఇబ్బందులు ఎదురైనప్పటికీ ప్రభుత్వ పెద్దలు, అధికారులు సమన్వయంతో పనిచేసి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేశారని పేర్కొన్నారు. నాగులవంచ, చింతకాని సహకార సంఘాలు మొక్కజొన్న కొనుగోళ్లలో అగ్రగామిగా నిలవడంపై చింతకాని సహకార సంఘం అధ్యక్షుడు కొండపల్లి శేఖర్ రెడ్డి, సీఈఓ శ్రీనివాసరావు, నాగులవంచ సహకార సంఘం అధ్యక్షుడు నల్లమోతు శేషగిరిరావు, సీఈఓ శ్రీనివాసరావులను అభినందించారు. రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు అండగా నిలిచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. .

.

కొనుగోళ్ల వివరాలు


చింతకాని మండలంలో మొత్తం 9,450 మంది రైతుల నుంచి 6,66,330 క్వింటాళ్ల మొక్కజొన్నను కొనుగోలు చేశారు. చింతకాని సహకార సంఘం పరిధి (18 గ్రామాలు): 6,700 మంది రైతులు, 4,32,960 క్వింటాళ్లు1.నాగులవంచ సహకార సంఘం పరిధి (8 గ్రామాలు): 2,740 మంది. 2.రైతులు, 2,33,370 క్వింటాళ్లు రైతులకు చెల్లించాల్సిన మొత్తం రూ.159.91 కోట్లకు పైగా ఉండగా, కొనుగోలు చేసిన ధాన్యానికి సకాలంలో రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుండటంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో నాగులవంచ సర్పంచ్ నారగాని రాంబాయి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కన్నెబోయిన గోపీ, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కొప్పుల గోవిందరావు, అబ్దుల్ నబీ, కూరపాటి కిషోర్, బొర్ర ప్రసాదరావు, బొర్రా లక్ష్మణరావు, మద్దినేని పరిణిత వైఫ్/ ఆఫ్. నాగేశ్వరరావు, కంచమూర్తి రామకృష్ణతో పాటు పలువురు నాయకులు, అధికారులు, సహకార సంఘాల సిబ్బంది, రైతులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *