పయనించే సూర్యుడు, జూన్ 3 2026, నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండల కేంద్రంలోని గ్రామ పంచాయితీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ పురస్కరించికొని మంగళవారం గ్రామ సర్పంచి మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ జెండా ఆవిష్కరించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముఖ్యఅతిథిగా వచ్చిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి జెండా ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణ అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. త్యాగాల పునాదిపై ఆవిభవించిన తెలంగాణ ఆత్మగౌర వానికి చిరునామగా తెలంగాణ అభివృద్ధి, సంక్షేమాలకు నాంది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అని తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరులు త్యాగాలను స్మరించుకుంటూ ఉద్యమకారుల ఆకాంక్షలు ప్రజల ఆశలతో ఏర్పడిన మన తెలంగాణ రాష్ట్రం అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో మరింత ప్రగతి సాధించాలని తెలియజేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో విద్యార్థులు, ఉద్యమకారులు ఎందరో బలిదానాల వల్ల ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామని తెలియజేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ ఇవ్వడం వల్ల పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర బిల్లు పాస్ చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు యెన్నం భూపతి రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ మట్ట వెంకటయ్య గౌడ్, ఉప సర్పంచి ఎర్ర శ్రీను, కార్యదర్శి గిరి, వార్డు సభ్యులు పాలాది మల్లీశ్వరి రంగనాథం, దేవేందర్, జంగిలి ఆనంద్, గుద్దటి కిష్టల్, గోసుల కొండయ్య, మసిగుండ్ల వెంకటేష్, మారేపల్లి మంజుల శ్రీను, శిరుశనగండ్ల శేఖర్, రేవల్లి మానస రాజు, రవీందర్ రెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మట్ట భరత్, కాంగ్రెస్ నాయకులు కొయ్యల పుల్లయ్య, రేవల్లి రాజు, తుంగ శ్రీను, మట్ట నాగార్జున తదితరులు పాల్గొన్నారు.