పయనించే సూర్యుడు, జూన్ 3 2026, నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కల్వకుర్తి మున్సిపల్ పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, తెలంగాణ ఉద్యమంలో ప్రాణ త్యాగం చేసిన అమరవీరుల స్థూపానికి పాలాభిషేకం చేసి నివాళులర్పించడం జరిగింది. కల్వకుర్తి బస్టాండ్ ప్రయాణికుల ప్రాంగణం వద్ద వేసవి ఎండల దృష్టిలో పెట్టుకొని ఉప్పల చారిటబుల్ ట్రస్టు ద్వారా 78 రోజుల పాటు ఉచితంగా నిర్వహించిన అంబలి కేంద్రం మరియు చలివేంద్రం ముగింపు కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఆర్య వైశ్య సంఘం వారు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కల్వకుర్తి నియోజకవర్గం లో ఉన్న అన్నదాతను ఆదుకోవాలని సమయానికి వడ్లను ,మక్కలను ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతు ఖాతాలో డబ్బులు వేయాలని కల్వకుర్తి తిరుపతి హైవే పైన వడ్లను ఎండపెట్టిన రైతుల వద్దకు వెళ్లి వారికి మద్దతుగా నిలవడం జరిగింది. అక్కడి నుండి కల్వకుర్తి మున్సిపల్ పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీ చెందిన సల్మా మైనార్టీ కుటుంబం ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని వారి ఇంటి వద్దకు చేరుకుని ఇల్లు నిర్మాణం చేపిస్తానని హామీ ఇచ్చారు. అక్కడి నుండి ఇటీవల ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదానికి గురైన బిఆర్ఎస్ పార్టీ తర్నికల్ నాయకుడు సురేష్ గౌడ్ ఇంటికి చేరుకొని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో సూర్య ప్రకాష్ రావు, భావండ్ల మధు, కౌన్సిలర్లు రాము నాయక్, సుశీల, ఈశ్వరయ్య, మనోహర్ రెడ్డి, దారమోని గణేష్, ఆర్య వైశ్యులు శ్రీనివాసులు, ప్రసాద్, పూరి రమేష్, సర్పంచులు మరియు మాజీ ఎంపీటీసీలు, మాజీ కౌన్సిలర్, మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.