చింతకాని సొసైటీలో జీలుగులు, జనుముల పంపిణీ

పయనించే సూర్యుడు జూన్ 09, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు) చింతకాని మండల కేంద్రంలోని సహకార సంఘం (సొసైటీ) ఆధ్వర్యంలో రైతులకు జీలుగులు, జనుముల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు అవసరమైన విత్తనాలను అందజేస్తూ, ఇవి ఈరోజు నుంచే అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.రైతులు ప్రభుత్వ సబ్సిడీ పథకాలను సద్వినియోగం చేసుకొని వ్యవసాయ ఉత్పత్తిని పెంచుకోవాలని సూచించారు. నాణ్యమైన విత్తనాలతో సాగు చేపట్టడం ద్వారా మెరుగైన దిగుబడులు సాధించవచ్చని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కన్నేబోయిన గోపి, సొసైటీ చైర్మన్ కొండపల్లి శేఖర్ రెడ్డి, చింతకాని సర్పంచ్ కిలారు మనోహర్ బాబు, కాంగ్రెస్ మండల అధికార ప్రతినిధి కూరపాటి కిషోర్, సీఈఓ శ్రీనివాస్, డైరెక్టర్లు కొల్లి గోవిందరావు, నన్నాక కోటయ్య, ఆత్మ కమిటీ డైరెక్టర్ కొప్పుల గోవిందరావు, సొసైటీ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *