జనం న్యూస్ జూన్ 7 భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల ప్రతినిధి ఈ విద్యా సంవత్సరం (2026-27) త్రిబుల్ ఐటీ ప్రవేశాల్లో జిల్లాలోనే అత్యధికంగా నలుగురు విద్యార్థులు మహదేవ్పూర్ బాలికల పాఠశాల నుండి అర్హత సాధించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు కుమారి గరిగే రితిక,మహ్మద్ రిమ్ష ,మోటం అక్షిట్, త్రిబుల్ ఐటీ బాసరకు ఎంపికయ్యారు. మరియు మట్టి పావని ట్రిపుల్ ఐటి మహబూబ్నగర్ కి ఎంపికయింది. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, గ్రామ సర్పంచ్ శ్రీమతి హసీనా బాను, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి మరియు ఉపాధ్యాయ బృందం సరిత, మడక మధు, సుధారాణి సరితా దేవి హోలీ పాషా శ్రీనివాస్ వసుదప్రియ వీరేశం సమ్మయ్య లీలారాణి రజిత సాహిదా బేగం ప్రసూన దీపిక పూర్ణిమ ఆంజనేయులు అజ్మత్ పాషా తదితరులు అభినందించారు