జనం న్యూస్ జూన్ 7 కోటబొమ్మాళి మండలం :సొంతంగా తయారు చేసిన విత్తన గుళికల ద్వారానే ప్రకృతి వ్యవసాయంలో అధిక దిగుబడులు పొందవచ్చునని ప్రకృతి వ్యవసాయ సిబ్బంది తెలిపారు. శనివారం జిల్లా ప్రకృతి వ్యవసాయ విభాగం డీ.పీ.ఎం పూజారి సత్యన్నారాయణ ఆదేశాల మేరకు టెక్కలి డివిజన్ కోటబొమ్మాళి మండలం తర్లిపేట గ్రామంలో సచివాలయ సిబ్బంది తో కలిసి విత్తన గుళికలు తయారుచేసి పొలాల్లో నాటడం జరిగిందన్నారు. ఈ విదంగా నాటడం వలన కొద్దిపాటి వర్షానికి మొలకలు వచ్చి నేలను కప్పి ఉంచడం ద్వారా భూమిలో ఉన్న తేమను అలాగే సేంద్రియ కర్బనం ఆవిరి కాకుండా నివారించబడుతుంది. అలాగే విత్తన గుళికల్లో దీర్ఘకాలిక పంటలైన అనుములు, అలసందలు, గోరుచిక్కుడు, కందులు, ఆముదలు, సజ్జలు పై రకాల విత్తనాలు గుళికలుగా చేసి ఫిల్డ్ లో నాటడం జరిగిందన్నారు. గ్రామ రైతులు, వాడరేవు శ్రీనివాసరావు, కర్ణి భాస్కరరావు, బచ్చల రామస్వామి పై రైతుల పొలాల్లో విత్తన గుళికలు వేయడం జరిగిందన్నారు. ఈ విత్తనాలకు కొద్దిపాటి తేమ తోడైతే మొలకలు వచ్చి నేలను సంవత్సరం పాటు కప్పి ఉంచి ఆదాయం రావడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పొంక సింహాచలం ఎఫ్. ఎం. టి మరియు ఐ. సి. ఆర్. పి లు దుంపల సూర్యం, బండి పద్మ, శిమ్మ రాధ, వరదు లత హాజరయ్యారు.