త్రైత సిద్ధాంత భగవద్గీత ప్రచారం

జనం న్యూస్ జూన్ 7 రావికమతం విలేఖరి గుమ్మడి వెంకటేశ్వరరావు పౌర్ణమి సందర్భంగా త్రైత సిద్ధాంత ప్రబోధ సేవా సమితి ఇందూజ్ఞానవేదికవిజయరాంపురం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మండలం లోని కొత్తకోట గ్రామం లో శనివారం త్రైత సిద్ధాంత భగవద్గీత, అనుబంధ త్రైత సిద్దాంత జ్ఞాన గ్రంథాల ప్రచారం ను ఇంటింటా నిర్వహించారు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తన కాల ఙ్ఞానం లో తాడిపత్రి లోని ప్రబోధాశ్రమము ఉన్నత మైన ఙ్ఞానం కలిగినదనిచెప్పారు… మహాదేవతలు అందరూ అట్టి ఆనందాశ్రమం లో ఆనందగురువు వద్ద నే ఉన్నారు అని చెప్పాఅని అన్నారు ప్రబోధాశ్రమం నుండి వెలువడిన త్రైత సిద్ధాంతము గొప్పది అనిపరోక్షంగాచెప్పారు..త్రైత సిద్ధాంత భగవద్గీత గ్రంథం శ్రీకృష్ణుడి అసలైన జ్ఞానం ను తెలియజేస్తుంది., ప్రతి ఒక్కరూ కర్మ యోగం విశిష్టత, త్రైత సిద్ధాంత జ్ఞానం తెలుసుకోవాలి అనే ముఖ్య ఉద్దేశంతో భగవద్గీత ప్రచారం చేస్తున్నాము అని , మన శరీరంలో దేవుడు మూడు ఆత్మలు గా విభజింపబడి ఉన్నాడని – జీవాత్మ, ఆత్మ, పరమాత్మ ల గురించి తెలుసుకోవడమే త్రైత సిద్ధాంతం అని తెలిపారు, భగవద్గీత లో కర్మయోగం, బ్రహ్మయోగం, భక్తియోగం అనేవి దైవ ధర్మాలు అని వాటి ప్రకారం నడుచుకుంటే కర్మ నుండి బయట పడేసి మనిషికి ముక్తిని ఇస్తాయి అని తెలిపారు.ఈకార్యక్రమంలో త్రైత సిద్దాంతం ప్రబోధసేవాసమితి ఇందూజ్ఞానవేదికవిజయరాంపురం కమిటీ అధ్యక్షుడు, సభ్యులు కే.త్రినాధ రావుజికృష్ణసూరప్పుడు, బంగారు నాయుడు, సంతోష్ లక్ష్మి, రాజు, భారతి, బంగారు తల్లి లు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *