ఏన్కూరు లో యదేచ్ఛగా ఎన్‌ స్ పి కాలువ కట్ట మట్టి దందా

* ప్రజా ప్రతినిధుల హస్తం ఉన్నట్టు గిరిజన నాయకుల ఆరోపణలు * అనుమతులు లేకుండానే తవ్వకాలు - ఇరిగేషన్ అధికారుల మామూళ్ల మత్తులో హంగామా

పయనించే సూర్యుడు జూన్ 2 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూరు మండలంలో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ – ఎన్‌ఎస్పీ కాలువ కట్ట మట్టిని అక్రమార్కులు యథేచ్ఛగా తరలిస్తున్నారు. సిరిపురం కెనాల్ కాలువ మరమ్మత్తుల కోసమే మట్టి తీస్తున్నామని కాంట్రాక్టర్ బుకాయిస్తున్నా, క్షేత్రస్థాయిలో జరుగుతున్న తంతు వేరుగా ఉంది.

అనుమతులు లేవు:

కాలువ కట్ట మట్టి తవ్వకాలకు ఎలాంటి తాజా అనుమతులు లేవని సంబంధిత అధికారులే చెబుతున్నారు. బడా కాంట్రాక్టర్ అధికారులను భయభ్రాంతులకు గురిచేసి వారిపై అధికారంలో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధుల నుండి వారికి ఫోన్లు చేపించి మట్టితోలకాలను మీరు ఆపితే మీ పైన చర్యలు తీసుకొని మిమ్మల్ని ఇక్కడి నుండి దూరప్రాంతాలకు ట్రాన్స్ఫర్లు చేస్తాము అని బెదిరింపులకు పాల్పడ్డారు క్షేత్రస్థాయి అధికారులు భయపడి చేతులు ఎత్తేయడం జరిగింది క్షేత్రస్థాయి అధికారులను జిల్లా అధికారులు కూడా వార్నింగ్ ఇచ్చినట్టు గా విశ్వసనీయమైన సమాచారం ఇంత అక్రమాలకు పాల్పడితే ఏ అధికారి వీరి ఆగడాలను అడ్డుపడతారు అక్రమ మట్టి దందాను అరికట్టే అధికారులే లేరా ఇక అని గిరిజన నాయకులు స్థానికులు మండిపడుతున్నారు

పాత అనుమతులే సాకు:

కాంట్రాక్టర్ మాత్రం గతంలో పొందిన అనుమతులనే అడ్డుపెట్టుకుని భారీ యంత్రాలతో రాత్రింబవళ్లు మట్టి తరలిస్తున్నాడు.

ఒక కాలువకు మరో కాలువ బలి:

ఒక కాలువ నిర్మాణం కోసం మరో కాలువ కట్టను ధ్వంసం చేస్తున్న వైనంపై స్థానికులు మండిపడుతున్నారు.

అధికారుల అండదండలు:

మామూళ్ల మత్తులో ఇరిగేషన్ శాఖ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు అని స్థానికుల తీవ్ర ఆరోపణ.

ప్రజా ప్రతినిధులు అక్రమ వసూళ్లు

బడా ట్రాక్టర్లు ఏజెన్సీ ప్రాంతంలో అక్రమంగా మట్టి తోలకాలు దందా చేస్తున్న పట్టించుకోని ప్రజాప్రతినిధులు ఏన్కూరు మండలంలో ఎటువంటి దందా జరిగిన ఆ దందాకు సంబంధించి ప్రజా ప్రతినిధులకు పర్సంటేజ్ ల రూపంలో అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నారు అభివృద్ధి పనుల పేరుతో చేసే ప్రతి పనిలో ప్రజాప్రతినిధులకు పర్సంటేజ్ అనేది ఇవ్వాల్సిందే పర్సంటేజ్ ఇస్తే చాలు నాసిరకంగా పనులు ఉన్న పర్లేదు అక్రమంగా మట్టితోలకాలు మరియు ఎటువంటి దందాలకు పాల్పడిన ప్రజాప్రతినిధులకు సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తున్నారు అని గిరిజన సంఘాలు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏన్కూర్ మండల పరిధిలోని ఎన్‌ఎస్పీ కాలువ కట్టపై జేసీబీ, టిప్పర్లతో మట్టిని తోడేస్తున్నారు. సిరిపురం కెనాల్ మరమ్మత్తుల పేరుతో మొదలైన ఈ తవ్వకాలు అదుపు తప్పాయి. కాలువ కట్ట బలహీనపడితే భవిష్యత్తులో నీటి సరఫరాపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని గిరిజన సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలువ కట్ట మట్టి తీస్తే వర్షాకాలంలో కట్టకు గండ్లు పడతాయి. వేల ఎకరాలకు నీరందక పంటలు ఎండిపోతాయి. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు’ అని ఏన్కూరు గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారుల తీరుపై విమర్శలు:

అనుమతులు లేకుండా జరుగుతున్న తవ్వకాలను వెంటనే నిలిపివేసి, పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అక్రమ మట్టి తరలింపు వెనుక పెద్ద కాంట్రాక్టర్ మాఫియా ఉందని, అధికార పార్టీ నేతల అండ ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారు.

అక్రమ మట్టి తవ్వకాలను తక్షణమే నిలిపివేయాలి.

అనుమతులు లేకుండా తవ్వకాలు జరిపిన కాంట్రాక్టర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసి, బ్లాక్ లిస్టులో పెట్టాలి. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇరిగేషన్ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. కాలువ కట్టకు జరిగిన నష్టాన్ని కాంట్రాక్టర్‌తోనే పునరుద్ధరింపజేయాలి. జిల్లా కలెక్టర్ స్వయంగా విచారణ జరిపి బాధ్యులపై పిడి యాక్ట్ నమోదు చేయాలి అని గిరిజన సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *