రాష్ట్రవ్యాప్తంగా వివోఏల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి..

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నంబూరు రామలింగేశ్వర రావు..

పయనించే సూర్యుడు న్యూస్ :మే 28,తల్లాడ రిపోర్టర్ రాష్ట్రవ్యాప్తంగా వివోఏల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించి, వారికి కనీస వేతనాన్ని అమలు చేయాలని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి నంబూరు రామలింగేశ్వరరావు డిమాండ్ చేశారు. గత కొన్ని రోజులుగా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గ్రామ దీపికలు తల్లాడలో చేపట్టిన దీక్షకు బుధవారం ఆ పార్టీ ఆధ్వర్యంలో సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బిజెపి తల్లాడ మండల అధ్యక్షులు చల్లా నాగులు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామ దీపికలకు కనీస వేతనం 20వేలు అందించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని కోరారు. గత కొన్ని రోజులుగా గ్రామ దీపికలు దీక్షలు చేపడుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వారిని గుర్తించి 20వేల వేతనాన్ని ఇవ్వాలని కోరారు. లేనీపక్షంలో తమ పార్టీ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో ఉధృతంగా ఆందోళనలు చేస్తామని ఆయన ఘాటుగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు చల్లనాగులు, ప్రధాన కార్యదర్శి కార్యదర్శులు రాయల రమేష్, పెరిక కిరణ్, మండల ట్రెజరీ యద్దనపూడి శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు ఉద్దగిరి రామారావు, ఎస్సీ మోర్చా అధ్యక్షులు వేమా అశోక్, యువమోర్చా నాయకులు కటికి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *