పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ జూన్ 06 మామిడిపెల్లి లక్ష్మణ్ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలోని గంగాదేవి పార్క్‌లో శుక్రవారం రోజున రాయికల్ అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కల నాటడం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారులు, గ్రామస్థులు కలిసి మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎఫ్ఆర్వో భూమేశ్వర్ మాట్లాడుతూ.. చెట్ల పెంపకం ద్వారా భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీనివాస్, ఉప సర్పంచ్ నాగిరెడ్డి సాయిరెడ్డి, కార్యదర్శి రాజేష్, కనపర్తి శ్రీనివాస్, పకృతి ప్రేమికుడు సుంకిశాల సత్తయ్య గౌడ్ అటవీశాఖ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.