మాటలతో కాలం ఎల్లదీస్తున్న ప్రభుత్వం

* ప్రజా సమస్యలపై సీపీఎం పోరుబాట * క్షేత్రస్థాయిలో సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలి * జిల్లా స్థాయి శిక్షణ తరగతుల్లో పార్టీ శ్రేణులకు పిలుపు * సీపీఐ ( ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 6 అశ్వారావుపేట మండల రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో పూర్తిగా విఫలమైందని, ప్రజా సమస్యలు క్షేత్రస్థాయిలో పేరుకుపోతున్నాయని సీపీఐ(ఎం )రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సీపీఎం చేపట్టిన “పోరుబాట” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, పార్టీ శ్రేణులు సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. గత మూడు రోజులుగా నియోజకవర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లో గత మూడు రోజులుగా విజయవంతం సాగిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాజకీయ శిక్షణ తరగతు చివరి రోజు శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం తగిన బడ్జెట్ కేటాయింపులు చేయకపోవడంతో అవన్నీ నీటిమీద రాతలుగా మారాయని విమర్శించారు. ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లు తదితర సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక రాజకీయ జోక్యంతో సాగుతుండటంతో అసలైన నిరుపేదలకు అన్యాయం జరుగుతోందన్నారు. విద్యారంగాన్ని ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని పేర్కొంటూ, కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా ప్రభుత్వ విద్యాసంస్థల సమస్యలపై ఉద్యమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పోడు భూముల సమస్య తీవ్రంగా ఉందని, ఆదివాసీలు సాగు చేస్తున్న భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పోడు సాగుదారులపై ఫారెస్ట్, పోలీసు అధికారుల వేధింపులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. వలస ఆదివాసీ గ్రామాల పిల్లలకు ఎస్టీ ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలని, వారి విద్యా, సామాజిక అభివృద్ధికి ప్రభుత్వం అడ్డంకులు సృష్టించకూడదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలపై దాడి చేస్తోందని, హిందుత్వ భావజాలాన్ని బలవంతంగా రుద్దే ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. ఆదివాసీ హక్కులు, గిరిజన చట్టాల పరిరక్షణ కోసం సీపీఎం నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర వస్తువులు సరఫరా చేయాలని, రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. నకిలీ విత్తనాలు, ఎరువులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్పొరేట్ల కోసమే గిరిజన చట్టాల మార్పులు ఆదివాసీ జాతి మనుగడను ప్రమాదంలోకి నెడుతున్న బీజేపీ భద్రాచలం మాజీ ఎంపీ డాక్టర్ మిడియం బాబూరావు సీపీఎం రాష్ట్ర నాయకులు, భద్రాచలం మాజీ ఎంపీ డాక్టర్ మిడియం బాబూరావు మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం అటవీ హక్కుల చట్టాన్ని బలహీనపరిచే చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. గిరిజనులను భూములు, అటవీ ప్రాంతాల నుంచి దూరం చేయడానికే కొత్త అటవీ విధానాలను అమలు చేస్తోందన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని ఖనిజ సంపద, నీటి వనరులు, అటవీ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పగించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఆదివాసీ హక్కుల పరిరక్షణ, దేశ సంపద రక్షణ కోసం బీజేపీ ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ డాక్టర్ మిడియం బాబూరావు, జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య, ఎం.బి. నర్సారెడ్డి, కె. బ్రహ్మచారి, లిక్కి బాలరాజు, రేపాకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *