అన్నమయ్య జిల్లాలో దారుణం.

* తీసుకున్న రుణం చెల్లించలేదని పాడి ఆవులను తీసుకెళ్లిన డ్వాక్రా సంఘం సభ్యులు. * పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం మిట్టపల్లి గ్రామంలో ఘటన.

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ జూన్ 07.06.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ0 ప్రతినిధి జె. నాగరాజ// డ్వాక్రా సంఘం ద్వారా లక్ష రూపాయలు రుణం తీసుకున్న రాధమ్మ. వడ్డీ చెల్లించలేదని రాధమ్మ పై ఒత్తిడి చేసిన డ్వాక్రా సంఘాల మహిళలు, అధికారులు. గత పది రోజుల క్రితం రాధమ్మ ఇంటి వద్దనుండి 6 పాడి ఆవులను తీసుకెళ్లిన డ్వాక్రా సంఘం సభ్యులు. తమ కుటుంబం మొత్తం పాడి ఆవుల పై ఆధారపడి జీవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేసిన రాధమ్మ. పోలీసులకు ఫిర్యాదు చేసిన న్యాయం జరగలేదని ఆవేదన. మీడియాను ఆశ్రయించిన రాధమ్మ. తనకు న్యాయం చేయాలని మీడియా ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ప్రాధేయపడ్డ రాధమ్మ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *