పయనించే సూర్యుడు: రిపోర్టర్ శ్రవణ్ రాజ్ 4.7.2026 స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సేవా పథకం ఒకటి రెండు మూడు వారి నిర్వహణలో “అంతర్జాతీయ నో ప్లాస్టిక్ డే” కార్యక్రమాన్ని 03.07.2026 రోజున కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి కిరణ్ కుమార్ వైస్ ప్రిన్సిపాల్ ఐవీవి సత్యవతి ప్రారంభించారు . ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచంలో ఈ భూమి వాతావరణాన్ని ఎక్కువ నాశనం చేస్తున్న వస్తువులలో ప్లాస్టిక్ ఒకటి అని ప్లాస్టిక్ నిషేధ కార్యక్రమాన్ని విద్యార్థులు, అధ్యాపకులు సమాజంలో అవగాహన కలిగించే విధంగా కార్యక్రమాలు చేసి వృక్షాలను పెంచి భూమిని కాపాడాలని ఉద్భవించారు. అనంతరం విద్యార్థులు అధ్యాపకులచే ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమన్వయకర్త డాక్టర్ నారాయణ మూర్తి, జాతీయ సేవా పథకం ప్రోగ్రామ్ ఆఫీసర్స్ బి.పిచ్చమ్మ,డి. మాల్యాద్రి, సీనియర్ అధ్యపకులు వి అప్పలనాయుడు, హెచ్ సుధీర్, డాక్టర్ మల్లిబాబు డాక్టర్ కృష్ణారావు, డాక్టర్ రాధాకృష్ణ,వెంకటేష్ డాక్టర్ లక్ష్మీ మంగమ్మ, డాక్టర్ జ్యోతి, డాక్టర్ సూర్యవతి, డాక్టర్ సంధ్యడాక్టర్ వాసు దేవరాజు, సరస్వతీ, రామలక్ష్మి, కోమల, డాక్టర్ సంతోష్, కామర్స్ శ్రీనివాసరావు, హేమ గణేష్ వివిధ కళాశాల అధ్యాపక బృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు