అభంగాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ళను ప్రారంభించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సదా శివారెడ్డి , కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కోట్ల రవీందర్ రెడ్డి

పయనించే సూర్యుడు// న్యూస్ జూలై 4 //నారాయణపేట జిల్లా బ్యూరో// నారాయణపేట మండలం అభంగాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ళను ప్రారంభించారు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు, కోట్ల రవీందర్ రెడ్డి, ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకమందు ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పిన హామీని నిలబెట్టుకోవడం కాదు ఆచరణ చేసి చూపిస్తుందని అన్నారు, నేడు రాష్ట్రంలో ఏ గ్రామంలో వెళ్లి చూసిన ఇందిరమ్మ ఇల్లు కట్టుకొని పేద ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు, కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ శరణప్ప, గ్రామ సర్పంచ్ రవి, వార్డ్ మెంబర్ అనిత, కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకటప్ప, లబ్ధిదారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *