HWCS కోటకొండ సంఘం నూతన అధ్యక్షులుగా కెంచె శ్రీనివాసులు, ఏకగ్రీవంగా ఎన్నిక

పయనించే సూర్యుడు// న్యూస్ జులై 4 //నారాయణపేట జిల్లా బ్యూరో// చేనేత మరియు జౌళి శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని చేనేత సహకార సంఘాలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనందున . ఇందులో భాగంగా నారాయణపేట మండలం కోటకొండ గ్రామంలోని హ్యాండ్లూమ్ వీవర్స్ కో ఆపరేటివ్ సొసైటీ ( HWCS) కోటకొండ సంఘము యొక్క ఎన్నికలు నేడు, ఎలక్షన్ అధికారి శరత్, ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా జరిగినది. ఇందులో భాగంగా మొదటగా తొమ్మిది మంది డైరెక్టర్లను ఎన్నుకొని తధానంతరం అధ్యక్షులుగా కెంచె శ్రీనివాసులు, గారిని ఉపాధ్యక్షులుగా కెంచె నారాయణ ని , కార్యదర్శిగా ఎంగలి రఘు రాములు ని, కోశాధికారిగా సాక బాలప్ప గారిని మరియు డైరెక్టర్లుగా కొంగరి మణెమ్మ , పగడాకుల రాములు , భోగం రాములు , సంఘ రామేశ్వరమ్మ గారు , ఏర్పుల వెంకటరాములు , మొదలైన వారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది. ఈ సందర్భముగా నూతనంగా ఎన్నికయిన అధ్యక్షులు కెంచే శ్రీనివాసులు మాట్లాడుతూ కోటకొండ చేనేత పరిశ్రమకు ప్రత్యేక గుర్తింపు ఉందని దానిని కాపాడుకోవడం మన బాధ్యత అని చేనేత కార్మికులు సమస్యలు పరుస్కారం కొరకు నిరంతరంవారి మధ్యన ఉంటూ పనిచేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ ఈడ్గి వెంకట్రాములు గౌడ్ , మాజీ అధ్యక్షులు పగడాకుల శ్రీనివాసులు , మాజీ ఉపాధ్యక్షులు కొంగరీ రాములు , మాజీ డైరెక్టర్లు సాక బాలస్వామి , కెంచె మణెమ్మ , ఉట్కూరు భీమయ్య , కెంచె అంజలమ్మ మరియు సంఘ సభ్యులు అందరూ హాజరు అయ్యి నూతన పాలకవర్గానికి తమ పూర్తి మద్దతు తెలియజేశారు.

.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *