ఉండి వైఎస్సార్‌సీపీ ఎస్‌ఆర్‌ఐ సమావేశంలో ముదునూరి మురళీకృష్ణంరాజు

పయనించే సూర్యుడు న్యూస్, జూలై 04 (ఏలేశ్వరం మండల రిపోర్టర్ ఏ శివాజీ) : ఉండి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ఎస్‌ఆర్‌ఐ (శ్రీ ) కార్యక్రమంలో భాగంగా బీఎల్‌ఏలు, పార్టీ అనుబంధ విభాగాల ముఖ్య నాయకులతో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నరసాపురం పార్లమెంట్ పరిశీలకులు, ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ నాయకులు, ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముదునూరి మురళీకృష్ణంరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉండి నియోజకవర్గ ఇన్‌చార్జి పి.వి.ఎల్. నరసింహారాజు ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత బలోపేతం, ఎస్‌ఆర్‌ఐ కార్యక్రమం విజయవంతం చేయడం, బూత్ స్థాయి కమిటీల పనితీరు, రానున్న రాజకీయ కార్యాచరణపై సమీక్ష నిర్వహించారు. పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేసి ప్రజల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని ముదునూరి మురళీకృష్ణంరాజు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కౌవూరు శ్రీనివాస్, జిల్లా బూత్ కమిటీ అధ్యక్షుడు డీవీడీ ప్రసాద్, నియోజకవర్గ బూత్ కమిటీ అధ్యక్షుడు రాధాకృష్ణ, జిల్లా ఎస్‌ఐఆర్ కార్యక్రమ పరిశీలకుడు కామన నాగేశ్వరావు, పడాల కిషోర్ రెడ్డి, ఉండి మండల అధ్యక్షుడు ఆంజనేయరాజు, ఆకివీడు మున్సిపల్ చైర్‌పర్సన్ జామి హైమవతి, సీతారామయ్య, మండల అధ్యక్షులు, బీఎల్‌ఏలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *