ఐటివరం గ్రామంలో రాములవారి గుడి పదమా వార్షికోత్సవం సందర్భంగా ఘనంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ

జనం న్యూస్ ప్రకాశం జిల్లా/ మార్కాపురం జిల్లా/పుల్లల చెరువు మండలం రిపోర్టర్ బి వివేక్ పుల్లలచెరువు మండలం ఐ.టి.వరం గ్రామంలోని శ్రీ రాములవారి గుడి పదమా వార్షికోత్సవం సందర్భంగా తెలుగు టైటన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ఉత్సాహభరితంగా, విజయవంతంగా జరిగింది. విజేతలు: ప్రథమ బహుమతి – తెలుగు టైటన్స్, ఐటివరం ద్వితీయ బహుమతి – ముత్రాసుపాలెం గ్రామం, నూజెండ్ల మండలం తృతీయ బహుమతి – అనసుందరం గ్రామం, త్రిపురాంతకం మండలం బహుమతుల దాతలు ప్రథమ బహుమతి –30,116 సురభత్తిన ఏడుకొండలు ద్వితీయ బహుమతి – 20,116 సురభత్తిన మిల్లు వెంకటేశ్వర్లు తృతీయ బహుమతి – 10,116 సురభత్తిన రాముడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పుల్లలచెరువు మండల పార్టీ అధ్యక్షులు పోట్ల గోవిందు , ముతుకుల సొసైటీ చైర్మన్ పావులూరు యోగిశ్వరరావు, పాల్గొని క్రీడాకారులను అభినందించారు. అదేవిధంగా సురభత్తిన రమేష్ గద్దె మల్లయ్య మాదినీడీ వెంకట శేషయ్య సురభత్తిన ఏడుకొండలు సురభత్తిన రాముడు సురబతునిగోవిందరాజులు ,టీడీపీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ పెద్దలు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడంలో తమ వంతు సహకారం అందించారు. ఈ టోర్నమెంట్ విజయవంతం కావడానికి సహకరించిన నిర్వాహకులు, దాతలు, క్రీడాకారులు, అతిథులు మరియు పాల్గొన్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాములు. గెలుపు-ఓటములు ఆటలో భాగమే… క్రీడాస్ఫూర్తి, ఐకమత్యమే అసలైన విజయం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *