గ్రామసభల ద్వారా ప్రజా సమస్యలకు పరిష్కారం, తల్లాడ ఎంపీడీవో,శ్రీధర్ రాజు.

గ్రామ అభివృద్ధి నా ముందున్న లక్ష్యం సర్పంచ్ కోడూరు ఉమాదేవి వీర కృష్ణ.

పయనించే సూర్యుడు న్యూస్ :జూన్ 7,తల్లాడ రిపోర్టర్ మండల పరిధిలోని గొల్లగూడెం గ్రామపంచాయతీ కార్యాలయాలలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామసభల్లో ముఖ్యఅతిథిగా మండల ఎంపీడీవో శ్రీధర్ రాజు పాల్గొన్నారు.గ్రామాల సమగ్ర అభివృద్ధి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా విడతల వారీగా నిర్వహిస్తున్న ఈ గ్రామసభలు ప్రజాపాలనకు అద్దం పడుతున్నాయని తల్లాడ ఎంపీడీవో పేర్కొన్నారు,ఈ సందర్భంగా ప్రభుత్వం నిర్దేశించిన ఏడు ముఖ్య అంశాలపై గ్రామస్థులతో ప్రత్యక్షంగా చర్చించి వారి సమస్యలు సూచనలు అవసరాలను తెలుసుకున్నారు త్రాగునీటి సరఫర, వర్షాకాల సన్నద్ధత,ఘనవ్యర్థాల నిర్వహణ,జలసంరక్షణ,మొక్కల పెంపకం,వనసంరక్షణ, ఓటర్లజాబితా,ప్రత్యేక సమగ్ర సవరణ,వరదలు మరియు విపత్తుల,నిర్వహణ వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామాల్లో తలెత్తుతున్న సమస్యలను వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కార చర్యలు చేపట్టాలని, ప్రధాన సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి నిధులు పరిపాలనా అనుమతులు సాధించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రతి గ్రామసభను ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు గ్రామసభలు కేవలం సమావేశాలు కాకుండా గ్రామాల భవిష్యత్ అభివృద్ధికి మార్గదర్శక వేదికలుగా నిలవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీధర్ రాజు, గ్రామ సర్పంచ్ కోడూరు ఉమాదేవి, ఉప సర్పంచ్ నాగలక్ష్మి, మండల ఆర్ ఐ, డాక్టర్ ఉమామహేశ్వరరావు, ఏపీఎమ్ఓ రవికుమార్, మండల ఈఓ,బీసీ సెల్ అధ్యక్షులు కోడూరు వీర కృష్ణ, గ్రామ సెక్రెటరీ కవిత, వార్డు మెంబర్లు, ప్రజాప్రతినిధులు గ్రామపెద్దలు మహిళలు యువత గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *