జిల్లా సహకార బ్యాంకు చైర్మన్‌కు శుభాకాంక్షలు

పయనించే సూర్యుడు న్యూస్ :జూన్7 అనంతసాగరం మండలం, నెల్లూరు జిల్లా (రిపోర్టర్: వెంకటరమణారెడ్డి) నెల్లూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్‌గా ఒక సంవత్సరం పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా చైర్మన్ మెట్టుకూరు ధనుంజయ రెడ్డి హెల్పింగ్ హార్ట్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు ఆర్వీ రమణ రెడ్డి, యు ఆర్ ద పవర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కేఎస్ భరత్, కానగల శ్రీనివాస్ తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ధనుంజయ రెడ్డి నాయకత్వంలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు రైతులు, ఖాతాదారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సమర్థవంతంగా పనిచేస్తోందని అన్నారు. ఒక సంవత్సరం కాలంలో బ్యాంకు అభివృద్ధి, సేవల విస్తరణకు ఆయన చేసిన కృషి అభినందనీయమని కొనియాడారు. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో మరింత మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. అనంతరం పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా సత్కరించి తమ శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *