రాష్ట్ర వైఎస్ఆర్ సీపీ నాయకులు కాకుమాను రాజశేఖర్ ని ఘనంగా సన్మానించిన జగ్గయ్యపేట వైసిపి నేతలు…

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం జూన్ 4 జగయ్యపేట్ట పట్టణంలోని ఈరోజు న రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార విభాగం అధ్యక్షులు మాజీ లీడ్ క్యాప్ చైర్మన్ కాకుమాను రాజశేఖర్ కి జగ్గయ్యపేట నియోజకవర్గానికి విచ్చేసిన సందర్భంగా జగ్గయ్యపేట వైఎస్ఆర్సిపి నాయకులు ఘనంగా వారిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలో రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ని ముఖ్యమంత్రిగా చేసుకునే విధంగా పార్టీలో కష్టపడుతూ నిత్యం ప్రచార కమిటీ పార్టీ యొక్క విధివిధానాలను ప్రజల్లోకి తీసుకెళుతున్న రాజశేఖర్ ని గౌరవ మర్యాదలతో కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్సిపి నాయకులు ప్రముఖులు శాలువాలతో సత్కరించి ఆత్మీయంగా వారికి స్వాగతం తెలియజేయడం జరిగింది… ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు రాష్ట్ర ప్రచార విభాగ అధ్యక్షులు శ్రీ కాకుమాను రాజశేఖర్ , రాష్ట్ర ఎస్సీ సెల్ బుదాల శ్రీనివాస్,,, ముదిగొండ ప్రకాష్ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి మరియు (ఎన్టీఆర్) జిల్లా ఎస్సీ విభాగ పరిశీలకులు,, రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ కార్యదర్శి కలపాల అజయ్ కుమార్. మరియు జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్సిపి నాయకులు చౌడవరపు జగదీష్ , వట్టెం మనోహర్ గారు,బద్దు నాయక్ , గోగుల వెంకయ్య , గంగోలు వినోద్ కుమార్ , గడ్డిపతి రాజేష్ ,డెరంగుల తిరుపతిరావు , తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *