ఫరూక్ నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాయికల్ శ్రీనివాస్ ను ఘనంగా సన్మానించిన సర్పంచులు

* గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకం * ఫరూక్ నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాయికల్ శ్రీనివాస్

పయనించే సూర్యుడు జూన్ 04 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) ఫరూక్‌నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాయికల్ శ్రీనివాస్‌ను వివిధ గ్రామాల సర్పంచులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. పార్టీ బలోపేతానికి ఆయన చేస్తున్న కృషిని అభినందిస్తూ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాయికల్ శ్రీనివాస్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు తీసుకురావడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా సర్పంచులు కృషి చేయాలని కోరారు. గ్రామాల అభివృద్ధిలో ప్రజాప్రతినిధుల పాత్ర కీలకమని, ప్రజల సమస్యల పరిష్కారానికి అందరూ సమిష్టిగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫరూక్‌నగర్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు, చించోడ్ సర్పంచ్ ర్యాకల శ్రీనివాస్‌తో పాటు అన్నారం సర్పంచ్ రామకృష్ణ, కిషన్‌నగర్ సర్పంచ్ నరసింహ, మధులాపూర్ సర్పంచ్ శివారెడ్డి, రాస్మల్లగూడ సర్పంచ్ శివరాములు, వెంకటరెడ్డిపల్లి సర్పంచ్ రమేష్, గంట్లవెల్లి సర్పంచ్ శివకుమార్, చిన్నచిలకమర్రి సర్పంచ్ యాదగిరి, అయ్యవారిపల్లి సర్పంచ్ గోపాల్‌రెడ్డి, ఉప్పరగడ్డ సర్పంచ్ చందు నాయక్, చిలకమర్రి సర్పంచ్ రవీందర్‌రెడ్డి, చెవులపల్లి సర్పంచ్ జంగయ్య, పుల్చర్లకుంట తండా సర్పంచ్ రాజు నాయక్, వెంకన్నగూడ తండా సర్పంచ్ ఆనంద్, గంట్లవెల్లి తండా మాజీ సర్పంచ్ మోహన్ నాయక్, రామేశ్వరం సర్పంచ్ సురేష్, ఎలికట్ట సర్పంచ్ బుడ్డ నరసింహ, దేవునిపల్లి సర్పంచ్ మల్లేష్, కొండన్నగూడ సర్పంచ్ సురేష్ గౌడ్, దూసకల్ సర్పంచ్ అంజి, శేరిగూడ సర్పంచ్ రామచంద్రయ్య గౌడ్, బుచ్చిగూడ సర్పంచ్ మల్లేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *