పయనించే సూర్యుడు మే 4 రాజేష్ దౌల్తాబాద్ ) దౌల్తాబాద్: ముత్యంపేట బంజేరుకుంటలో చెట్ల నరికివేతకు ఇరిగేషన్ పర్మిషన్ తీసుకున్న లెటర్ దౌల్తాబాద్ మండలం పరిధిలో మండలంలోని ముత్యంపేట గ్రామ సర్పంచ్ శ్రీమతి తోడంగి సునీత, ఆమె భర్త స్వామిపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ బుధవారం దౌల్తాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ అభివృద్ధి పనులపై వార్డు సభ్యులతో కలిసి చర్చిస్తున్న సమయంలో గ్రామానికి చెందిన తోడంగి స్వామి, రామయ్య, తోడంగి రాజు తదితరులు తమపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడి సమయంలో కత్తులతో బెదిరింపులకు పాల్పడటంతో పాటు శారీరకంగా దుర్వినియోగం చేశారని, గ్రామ కార్యాలయం నుంచి బయటకు లాగి అవమానించారని ఆరోపించారు. అంతేకాకుండా ప్రాణహాని కలిగిస్తామని బెదిరిస్తున్నారని సర్పంచ్ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ప్రాణభయం ఉందని, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని దౌల్తాబాద్ ఎస్ఐకు ఇచ్చిన ఫిర్యాదులో కోరారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం.
బంజర కుంట లో ఉన్న చెట్ల విషయం పై గొడవ…
ముత్యంపేట గ్రామంలోని బంజర కుంటలో ఉన్న చెట్లును నరికివేతకు ఇరిగేషన్, ఫారెస్ట్ అధికారుల పర్మిషన్ తోనే బంజర కుంటలో చెట్లను గ్రామ సర్పంచ్ పాలకవర్గం కలిసి చెట్లను అమ్మి గ్రామ అభివృద్ధికి ఖర్చు చేద్దామని గత నెలలో 150 చెట్లు రూ. 1,70,000 వేలకు సర్పంచ్ గ్రామ పాలకవర్గం తీర్మానం చేశారు. అదే బాత్రూంమంగళవారం ఆ చెట్లను అమ్మకానికి పెట్టి నరికి వేయించారు. అయితే సర్పంచి ఎన్నికల్లో ఓడిపోయిన తొడంగి స్వామి,తొడంగి రాజు, వర్గం ఆ చెట్లను ఎవరి పర్మిషన్ లేకుండా బంజేరు కుంట లో ఉన్న చెట్లను అమ్మకానికి పెట్టి నరికి వేయించారని ఆరోపణ చేశారు. ఇరిగేషన్,ఫారెస్ట్ అధికారులతో పర్మిషన్ తోనే అమ్మకానికి పెట్టి చెట్లను నరికి అమ్మి వేసామని సర్పంచ్ సునీత స్వామి, ఉప సర్పంచ్ తొడంగి కరుణాకర్ పాలకవర్గం మిగతా వర్గానికి తెలియజేశారు. బుధవారం గ్రామ సర్పంచ్ సునీత ఉప సర్పంచ్ తొడంగి కరుణాకర్ పాలకవర్గంతో కలిసి ఉదయం 11 గంటల సమయంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ అభివృద్ధి గురించి మాట్లాడుతుండగా గ్రామానికి చెందిన స్వామి,రాజు మీకు ఇష్టం వచ్చినట్లు చిట్టెందుకు ఏ విధంగా అమ్ముకుంటారని సర్పంచ్ పై దాడికి ప్రయత్నిస్తుండగా అక్కడున్న పాలకవర్గం అడ్డుకున్నారు. దీంతో గ్రామంలో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.