ప్రజా సమస్యల పై పోరాటమే ధ్యేయంగా

* అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేయాలి * కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా పోరాటం చేద్దాం * సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సయ్యద్ సలీం

పయనించే సూర్యుడు న్యూస్ మే 26 అశ్వారావుపేట మండలం రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట కేంద్రంలోని సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యాలయం అయిన సయ్యద్ మియాజాని భవనంలో మండల పట్టణ కౌన్సిల్ సమావేశం మండల కార్యదర్శి వగ్గెల అర్జునరావు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సయ్యద్ సలీం మాట్లాడుతూ శాఖ కార్యదర్శి లు అందరూ సమాయత్తమై 2026 పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని సత్వరమే పూర్తి చేయాలని అదేవిధంగా అశ్వారావుపేట మండలం, పట్టణంలో అనేక సమస్యలు ఉన్నాయని, వాటిపై పోరాటం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని అన్నారు. అశ్వారావుపేట మండలంలో పట్టణంలో అనర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేస్తున్నారనే వదంతులు వినిపిస్తున్న తరుణంలో అర్హులైన ప్రతి ఒక్క పేదవానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.అదేవిధంగా కార్మిక కర్షక రైతు వ్యతిరేక విధానాలతో ముందుకు పోతున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పేద ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేస్తూ ఏకతత్వ ధోరణిలో పరిపాలన చేయాలని చూస్తోందని దానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు గన్నిన రామకృష్ణ,సిపిఐ పట్టణ కార్యదర్శి నూకవరపు విజయ్ కాంత్ పట్టణ సహాయ కార్యదర్శి సయ్యద్ జాకీర్ మహిళా సంఘం నాయకులు చీపుర్ల సత్యవతి రిజ్వాన రోహిణి శ్రావణి మార్తిన సత్యవతి సిపిఐ నాయకులు చెన్నారావు వెంకన్న ప్రసాద్ విజయ్ శ్రీను పట్టణ మండల కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *