రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి, అధికారులను కోరిన చేగుంట ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మహమ్మద్ రఫీ

పయనించే సూర్యుడు న్యూస్ మే 30 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశబోయిన మహేష్ చేగుంట మండలంలో వడ్ల కొనుగోలు, కేంద్రాలను చేగుంట ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మహమ్మద్ రఫీ పరిశీలించారు.వారు మాట్లాడుతూ రైస్ మిల్లులకు వెళ్లిన లారీలు వెంటనే అన్లోడ్ చేయాలని సుమారు ఇక్కడ బస్తాల ధాన్యం నిల్వ ఉందని,ఇంకా కాంటా పెట్టని ధాన్యం చాలా ఉన్నది. త్వరగా అధికారులు స్పందించి రైస్ మిల్లులలో ఉన్న లారీలను త్వరగా అన్లోడ్ అయ్యే విధంగా చూడాలని వారన్నారు ఇక్కడ రైతులకు చాలా ఇబ్బంది ఉన్నది కొంచెం వర్షం వచ్చినా ధాన్యం తడిసిపోయి చేతికి వచ్చిన పంట కరాబ్ అవుతుంది అందువల్ల అధికారులు తొందరగా స్పందించి రైతులకు న్యాయం చేయాలని వారు కోరారు. ఉప సర్పంచ్ తో పాటు గ్రామ పెద్దలు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *