ఎరువులు విత్తనములు పురుగుమందుల అమ్మకంపై డీలర్లకు సూచనలు.

పయనించేసూర్యుడు మేజర్ న్యూస్ మే 21.05.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ/// చౌడేపల్లి వ్యవసాయ అధికారి కార్యాలయం నందు ఎరువులు పురుగుమందుల డీలర్లకు పుంగనూరు సహాయ వ్యవసాయ సంచాలకులు శివ కుమార్ సమావేశం నిర్వహించినారు. ఎరువులు విత్తనములు పురుగు మందులు గరిష్ట అమ్మకపు ధర కంటే ఎక్కువగా అమ్మ రాదు. రైతు కొనుగోలు చేసిన ప్రతి వస్తువుకు రైతు సంతకంతో కూడిన బిల్లు ఇవ్వాలి. స్టాక్ బోర్డును ప్రతిరోజు అప్డేట్ చేస్తూ ఉండాలి. ఎరువులను రైతు ఆధార్ నంబర్ తో బయోమెట్రిక్ తీసుకొని మాత్రమే అమ్మకం చేయాలి. రైతు కొనుగోలు చేసిన వాటితో పాటు ఇతర ప్రొడక్ట్స్ లింక్ చేసి అమ్మ రాదు. మంచి నాణ్యమైన కంపెనీల ఎరువులు విత్తనాలు పురుగుమందులు మాత్రమే అమ్మాలి. పై సూచనలు అతిక్రమించిన డీలర్ల లైసెన్సులు సస్పెండ్ లేక రద్దు చేయబడునని ఆదేశించడమైనది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *